గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటు సభలో వైసీపీ సభ్యులు నినాదలు
ప్రారంభంమైన అసెంబ్లీ సమావేశాలు..
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారని,, భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారని,, ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు.. సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడిందని,,రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి, పురోగతికి నోచుకేలదని చెప్పారు..కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు..2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని,,అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు.. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయన్నారు.. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లాయని అలాగే 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందన్నారు..
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయిందన్నారు.. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని తెలిపారు..కరవు నివారణ చర్యలు, రియల్‌టైమ్ గవర్నెన్స్ చేపట్టడడం జరిగిందన్నారు..భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారని,, కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారని వెల్లడించారు..చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమింది అంటూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముంగించారు..ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెనకబడిపోయిందన్న వ్యాఖ్యలపై సభలో వున్న వైసీపీ ఎమ్మేల్యే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు..హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు.. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగించడంతో,,వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు..