రేపటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమౌతాయి.. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు..గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది..జూలై చివరి తేదినాటికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనున్న నేపధ్యంలో మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.. పూర్తిస్థాయి బడ్జెట్ ను అక్టోబరులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది..ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా 23వ తేదిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు,, మరో మూడు శ్వేత పత్రాలైన శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల అంశాలను సభలో విడుదల చేసి, శ్వేతపత్రాల్లోని అంశాలపై చర్చ పెట్టనున్నట్లు తెలిసింది.