వైసీపీ వాళ్లకి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతాం-నాగబాబు
అమరావతి: జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కులను ఆదివారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అందిచేశారు..అంతకు ముందు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అయన మాట్లాడుతూ ప్రస్తుతం సందర్బంగా కాకపోయినప్పటికి మాట్లాడాల్సి వస్తొందని,,ఎన్డీఏ ప్రభుత్వ పాలన చేపట్టి 40 రోజులు కూడా పూర్తి కాక ముందే వైసీపీ వాళ్లు నెల రోజులకే కాట్ల కుక్కలాగా వెంట పడుతున్నారని మండిపడ్డారు..వీరికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసి దారిలో పెడతామని,,వీరు చేసిన ప్రతిపనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని వైసీపీ నేతలను నాగబాబు హెచ్చరించారు.. చేసిన అవినీతి, అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదు.. జగన్ ఏనాడు తన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదు.. ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని.. గత ఐదేళ్లల్లో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయట పెడతాం.. సీఎంగా అబద్దాలు చెప్పడంలో జగన్ కు డాక్టరేట్ ఇవ్వాలంటూ నాగబాబు విమర్శించారు.. రైతులు ఆత్మహత్య చేసుకుంటే,,అలాంటి ఏది జరగలేదని జగన్ చెప్పాడు.. కల్తీ సారా తాగి చనిపోతే,, సహజ మరణంగా జగన్ ప్రచారం చేశాడు.. నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్ కు సిగ్గుండాలి.. ఇంతకంటే దిగజారకండి అనిచెప్పే కొద్దీ ఇంకా దిగజారుతున్నారు అంటూ జగన్ తీరుపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుంది.. కేంద్రం సహకారంతో ప్రజా పాలన అందరూ చూస్తారని నాగబాబు పేర్కొన్నారు.