రాష్ట్రంలో భారీగా IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: ఎన్డీఏ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గత కొన్నిరోజులుగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల బదలీపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లు కన్పిస్తొంది..ఇందులో బాగంగానే రాష్ట్రంలో భారీగా IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా C.H.శ్రీదత్ (మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్) అదనపు బాధ్యతలు,,స్టాంపులు, రిజిస్ట్రేషన్‌లు ఐజీ, కమిషనర్‌గా M.V శేషగిరి,,హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ కమిషనర్‌గా రేఖా రాణి,,ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌కు (నేషనల్ హెల్త్ మిషన్ MDగా) అదనపు బాధ్యతలు,,సెర్ప్ CEOగా వీరపాండ్యన్,,మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్‌గా M.హరినారాయణ,,B.C సంక్షేమ డైరెక్టర్‌గా మల్లికార్జున (BC ఫైనాన్స్ కార్పొరేషన్) కమిషనర్‌గా అదనపు బాధ్యతలు,,సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగాను ప్రసన్నవెంకటేష్,,భూ సర్వే, సెటిల్‌మెంట్‌ల డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు,,సివిల్ సప్లైస్ కార్పొరేషన్ MDగా గిరిశ్ షా,,ఏపీ మార్క్ ఫెడ్ MDగా మంజీర్ జిలానీ (శాప్ MDగా) అదనపు బాధ్యతలు,,ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికా శుక్లా (బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గాను) అదనపు బాధ్యతలు,,APCPDCL CMDగా రవిసుభాష్,,APMSIDC MDగా లక్ష్మీ షా (ఎన్టీఆర్ వైద్య సేవ CEOగాను) అదనపు బాధ్యతలు,,మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ డైరెక్టర్‌గా M.వేణుగోపాల్‌రెడ్డి,,A.P స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ P.రాజబాబు,,ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్,,క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ MDగా G.C. కిషోర్‌కుమార్,,అగ్రికల్చర్ మార్కెట్ శాఖ డైరెక్టర్‌గా విజయసునీత,,ఉద్యానశాఖ డైరెక్టర్‌గా K.శ్రీనివాసులు,,సాంఘిక, సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణి,,APIIC MDగా అభిషిక్త్ కిషోర్ (APTDC MDగానూ) అదనపు బాధ్యతలు,,సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా A.సిరి,,R&R కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి (కాడా కమిషనర్‌గా) అదనపు బాధ్యతలు,,A.P ట్రాన్స్ కో జాయింట్ MDగా కీర్తి చేకూరి,,స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ MDగా గణేష్‌కుమార్ (టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా) అదనపు బాధ్యతలు,,పురపాలక శాఖ సంపత్‌కుమార్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు.