సజ్జల భార్గవ్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు?
అమరావతి: వైసీపీ ప్రభుత్వం హాయంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల విషయంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలపై చర్యలను తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు..సదరు పార్టీ సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, మరి కొంతమందిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు..నవంబరు 8వ తేది (శుక్రవారం) హైదరాబాద్ లోని మణికొండ వద్ద భార్గవ్ రెడ్డి కదలికలను పోలీసులు కనుగొన్నారు..భార్గవ్ రెడ్డి పై ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి..ఈ నెల 8న పులివెందులలో వర్రా రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది..రాష్ట్రంలో భార్గవ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్న నేపథ్యంలో విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో కడపపోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో వీరిద్దరి కోసం ప్రత్యేక ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు వేగిరం చేశాయి.