సెలవుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు-కలెక్టర్
రాబోయే 3 రోజులు జిల్లాకు భారీ వర్షాలు..
నెల్లూరు: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని హెచ్చరించిన వాతావరణశాఖ హెచ్చరించింది..ఆగ్నేయ బంగాళాఖాతం,పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు..దిని వలన రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర,రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
కలెక్టర్ ఆనంద్:- వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్ ఆనంద్, జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు..ఆదివారం వర్చువల్ విధానంలో అధికారులతో సమావేశం అయ్యారు..నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 0861-2331261-7995576699 -1077.. కంట్రోల్ రూమ్ లో మూడు షిఫ్టులలో సిబ్బంది డ్యూటీలు పనిచేస్తారని పేర్కొన్నారు..డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలనీ RDO లు,తహసీల్దార్ లను ఆదేశించారు..