DISTRICTS

ఉపరాష్ట్రపతి, గవర్నర్ పర్యటన సందర్బంగా నగరంలో ట్రాఫిక్ అంక్షాలు-ఎస్పీ

నెల్లూరు: ఉపరాష్ట్రపతి,రాష్ట్ర గవర్నర్ల పర్యటన నేపధ్యంలో నెల్లూరు టౌన్ పరిధిలో 15 నిముషాల పాటు ట్రాఫిక్ నిలుపుదల చేయడం జరుగుతుందని,ప్రత్యామ్న్యాయ మార్గాలలో వెళ్ళాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు.

రాష్ట్ర గవర్నర్ గారి పర్యటన సందర్బంగా:- 16.08.2024 వ తేదీన రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో 15 నిముషాల పాటు ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుంది.

రూట్:- మెయిన్ రైల్వే స్టేషన్ నుండి – మినిబైపాస్ – మాగుంట లేఅవుట్- KVR జంక్షన్- మినర్వా గ్రాండ్- కొండాయపాలెం గేట్- R&B గెస్ట్ హౌస్ వరకు మార్గం.

ట్రాఫిక్ నిలుపుదల ప్రదేశాలు: మెయిన్ రైల్వే స్టేషన్ వద్ద, BGR విగ్రహం వద్ద, KVR జంక్షన్ వద్ద, AC స్టేడియం ఎదురుగా ఉన్న జక్షన్ వద్ద ట్రాఫిక్ నిలివేస్తారు.

17.08.2024 వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో 15 నిముషాల పాటు ట్రాఫిక్ నిలుపుదల చేస్తారు.

రూట్:- R&B గెస్ట్ హౌస్ నుండి – కొండాయపాలెం గేట్– మినర్వా గ్రాండ్ – KVR జంక్షన్- మాగుంట లేఅవుట్ – మినిబైపాస్ – మెయిన్ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళే మార్గం.

ట్రాఫిక్ నిలుపుదల ప్రదేశాలు: AC స్టేడియం ఎదురుగా ఉన్న జక్షన్ వద్ద, KVR జంక్షన్ వద్ద, BGR విగ్రహం వద్ద, మెయిన్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ నిలుపుదల చేయబడును..

ఉపరాష్ట్రపతి పర్యటన సందర్బంగా:-

17.08.2024 వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్యలో 15 నిముషాల పాటు ట్రాఫిక్ నిలుపుదల:

రూట్:- పోలీస్ పెరేడ్ గ్రౌండ్- KVR జంక్షన్- GNT రోడ్ మీదుగా అయ్యప్పస్వామి గుడి- నేషనల్ హైవే- బుజబుజ నెల్లూరు- అక్షర స్కూల్ వరకు వెళ్ళే మార్గం.

ట్రాఫిక్ నిలుపుదల ప్రదేశాలు: దర్గా జంక్షన్ వద్ద, బట్వాడిపాలెం జంక్షన్ వద్ద, KVR జంక్షన్ వద్ద, అయ్యప్పస్వామి జంక్షన్ వద్ద, నేషనల్ హైవేపై ఒంగోలు మీదుగా వచ్చే వాహనాలను సుందరయ్య కాలనీ వద్ద మరియు గూడూరు మీదుగా వచ్చే వాహనాలను అక్షర స్కూల్ U టర్న్ వద్ద ట్రాఫిక్ నిలుపుదల చేయబడును..

17.08.2024 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో 15 నిముషాల పాటు ట్రాఫిక్ నిలుపుదల:

రూట్- స్వర్ణభారతి ట్రస్ట్- బుజబుజ నెల్లూరు- అయ్యప్పస్వామి గుడి- KVR జంక్షన్- పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు వెళ్ళే మార్గం.

ట్రాఫిక్ నిలుపుదల ప్రదేశాలు: వెంకటాచలం జంక్షన్ వద్ద, అయ్యప్పస్వామి జంక్షన్ వద్ద, KVR జంక్షన్ వద్ద, బట్వాడిపాలెం జంక్షన్ వద్ద, దర్గా జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిలుపుదల చేయబడును..

నెల్లూరు టౌన్ KVR జంక్షన్ నుండి అయ్యప్ప గుడి వరకు ఉన్న GNT రోడ్డు పై 17.08.2024 వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్యలో 15 నిముషాల పాటు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో 15 నిముషాల పాటు వాహనాలను నిలుపుదల చేయబడును..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *