DISTRICTS

 రూ.15లకే మూడు పూటలా నాణ్యమైన భోజనం-మంత్రి పొంగూరు నారాయణ

చేపల మార్కెట్‌ వద్ద అన్న క్యాంటీన్‌..

నెల్లూరు: రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు కూడా అన్నం లేకుండా పస్తులు ఉండకూడదని, వారి ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. శుక్రవారం నెల్లూరులోని చేపల మార్కెట్‌ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్‌ ను మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యతేజతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. 2014 -19 టీడీపీ ప్రభుత్వంలో 203 క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 183 క్యాంటీన్లు అప్పుడే ప్రారంభించామని గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసి నిరుపేదల కడుపుకొట్టిందని మండిపడ్డారు. కేవలం రూ. 5లకే ప్రతీ పేదవాడు చక్కగా నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాడన్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి అన్న క్యాంటీన్లు లేవన్నారు. రోజుకి రెండు లక్షల 25 వేల మంది అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం కొందరు దాతలు ముందుకు వస్తున్నారన్నారు. అందులో శ్రీనివాసరావు అనే దాత…రూ. కోటి రూపాయలు ఇచ్చారన్నారు. అలాగే ముఖ్యమంత్రి సతీమణి కూడా కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. నిన్న గుడివాడలో అన్న క్యాంటీన్‌ దగ్గర మరో రూ. 58 లక్షలు విరాళాలను దాతలు అందచేశారన్నారు. ఈ విధంగా కార్ఫస్‌ ఫండ్‌ డెవలప్‌ చేసి…అన్న క్యాంటీన్లను పర్మినెంట్‌గా ఉంచాలని సీఎం చెప్పారన్నారు.

అక్షయపాత్ర వాళ్లకి నిర్వహణ:- 2014 నుంచి 2019 వరకు ఏదైతే మెనూ ఉందో…ఇప్పుడు కూడా అదే మెనూను కంటీన్యూ చేస్తున్నామన్నారు. స్వచ్ఛంధ సంస్థ అయిన అక్షయపాత్ర వాళ్లకి అన్న క్యాంటీన్ల బాధ్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్కో వ్యక్తికి రోజుకు 90 రూపాయలు ఖర్చు చేస్తూ రూ. 15కే  పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం మూడు పూటలా అందిస్తున్నామన్నారు. మిగతా రూ. 75లు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ అజీజ్‌, అనురాధ, శ్రీనివాసులురెడ్డి, విజేత,సత్యనాగేశ్వరావు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *