శాటిలైట్‌ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన SSLV D-3 రాకెట్-సోమనాథ్
అమరావతి: సతీష్ థావన్ స్పెస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు SSLV D-3 రాకెట్ EOS-08 భూ పరిశీలన శాటిలైట్‌ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది..ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు..ఈ మేరకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు..SSLV-D3-EOS8 మిషన్‌లో ఇది మూడవది, చివరి ప్రయోగం..ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది..
ఈ సందర్బంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడుతూ SSLV-D3/EOS-08 చిన్న-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అని,, ఈ మిషన్‌లో మూడవ ప్రయోగమైన ఇది విజయవంతంగా పూర్తయిందని సోమనాథ్ వెల్లడించారు.. మొత్తం 17 నిమిషాలపాటు కొనసాగిన ఈ ప్రయోగంలో అంచనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టిందని తెలిపారు.. ‘‘పూర్తిస్థాయిలో ట్రాకింగ్ చేసిన తర్వాత తుది కక్ష్య తెలుస్తుందని,, అయితే ప్రస్తుత సంకేతాల ప్రకారం ప్రతిదీ ఖచ్చితంగా జరుగుతోందన్నారు.. EOS-08 ఉపగ్రహంతో పాటు SR-08 ఉపగ్రహం కూడా కక్ష్యలోకి చేరుకుందన్నారు..
EOS-08 శాటిలైట్:-సంవత్సరం పాటు సేవాలు అందించే విధంగా రూపొందించిన EOS-08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు..శాటిలైట్‌లో మూడు పే లోడ్స్ ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు..భూ పరిశీలన,,విపత్తు పర్యవేక్షణ,, పర్యావరణ పరిరక్షణ,,రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్‌ను రూపొందించారు.