రాబోయే 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణ శాఖ హెచ్చరిక
అమరావతి: రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు చేసింది.. శనివారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది..
మంగళవారం రాయలసీమలో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు, కోస్తాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.