వైసీపీ మాజీ ఎం.పీ నందిగం సురేష్ అరెస్ట్
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ బాపట్ల మాజీ ఎం.పీ నందిగం సురేష్ ను మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన్ను బుధవారం హైదరాబాద్ లో రాత్రి అరెస్ట్ చేశారు..ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.. అయితే బుధవారం మధ్యహ్నం తుది తీర్పు వెలువరుస్తూ హైకోర్టు, బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా,, ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు..హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సురేష్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం చేస్తున్నారని విశ్వనీయంమైన సమాచారం అందుకున్న పోలీసు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వెళ్లి అరెస్ట్ చేశాయి..సురేష్‌ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు..తొలుత ఎస్పీ కార్యాలయానికి తీసుకుని వెళ్లిన తరువాత కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడారు..చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ధర్మానసం, జోగి రమేష్‌కు బెయిల్ తిరస్కరించింది..వీరిని కూడా ఏ నిమిషంలో అయిన అరెస్ట్ చేసే అవకాశాలు వున్నాయి.