ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం-విపత్తుల నిర్వహణ సంస్థ
ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు..
అమరావతి: తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎం.డీ కూర్మనాథ్ మంగళవారం వెల్లడించారు..ఇది దాదాపు పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 730 కి.మీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ ఆగ్నేయంగా 770 కి.మీ,, ఖేపుపరా (బంగ్లాదేశ్)కి ఆగ్నేయంగా 740కి.మీ దూరంలో ఉందన్నారు..పూరీ,,సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో అక్టోబరు 24 & 25న శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖపట్నం,అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.. పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని,, సముద్రం అలజడిగా ఉంటుందన్నారు.. అక్టోబరు 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగినజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.