జనసేనపార్టీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి,ఎమ్మేల్యేలు
అమరావతి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,,మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యలు జనసేనపార్టీలో చేరారు..గురువారం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతించారు..అలాగే విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు..నాయకుల బాటలోనే మరికొందరు ద్వితీయశ్రేణి నాయకులు మరో కొద్ది రోజుల్లో వైసీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..పార్టీని వీడుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నం వైసీపీ నాయకత్వం చేస్తున్నప్పటికీ ఫలితం లేనట్లు తెలుస్తోంది..జగన్ వైఖరి నచ్చకపోవడంతోనే వీళ్లంతా పార్టీని వీడుతున్నారనే చర్చ జరుగుతొంది..