శ్రీ పోలేరమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
తిరుపతి: వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతొంది..గురువారం తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు..వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతరలో ప్రధాన ఘట్టం,, చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు..అమ్మవారి సేవకులు మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి ప్రాణప్రతిష్ట చేశారు..ఈ ప్రధాన ఘట్టంతో శ్రీ పోలేరమ్మ సమగ్రరూపం దాల్చి భక్తులకు దర్శనమిచ్చింది.. మధ్యాహ్నం 4 గంటల తరువాత అమ్మవారి విరూప శోభాయాత్ర జరుగనుంది. అనంతరం అమ్మవారి విరూపంతో శ్రీపోలేరమ్మ జాతర సంపూర్ణం కానుంది..
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు:- పోలేరమ్మవారికి ప్రభుత్వం తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సారె సమర్పించారు.. రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణకు రూ.50 లక్షలు ప్రకటించింది..వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కీలక ఘట్టమైన అమ్మవారి విగ్రహం తయారీ బుధవారం సాయంత్రానికి పూర్తి కాగా అమ్మ పుట్టినిల్లయిన కుమ్మరివీధిలోని కుమ్మరింట అమ్మవారి ప్రతిమను తయారు చేశారు.. కుమ్మరి కుటుంబీకులు పోలేరమ్మకు అమ్మగారి సాంగ్యం అందజేశారు.. రాజాలు సమర్పించిన పట్టుచీరను అమ్మవారికి అలంకరించారు..విగ్రహం తయారీ పూర్తయ్యాక అమ్మవారిని దర్శించుకునేందుకు ఉంచారు..మధ్యాహ్నం 4 గంటల తరువాత అమ్మవారి విరూప శోభాయాత్ర జరుగనుంది..అనంతరం అమ్మవారి విరూపంతో శ్రీపోలేరమ్మ జాతర సంపూర్ణం కానుంది.