బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కజాన్ చేరుకున్న ప్రధాని మోదీ
బ్రిక్స్ సదస్సుకు ముందే సరిహద్దు ఉద్రక్తతలపై ప్రకటన చేసిన చైనా..
అమరావతి: 16వ (BRICS) బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం రష్యాలోని కజాన్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం లభించింది..ప్రధాని మోదీ బస చేస్తున్న హోటల్‌కు చేరుకోగా ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు.. అక్కడే వారితో కొద్ది సేపు సంభాషించారు.. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రిక్స్ కూటమి నేతలతో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు..ఈ సమావేశంలోనే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ కూడా ఉంటుందని సమాచారం.. ఈ సందర్బంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందాన్ని చైనా మంగళవారం ధ్రువీకరించింది..ఈ విషయంపై ఇరుపక్షాలు చేసుకున్న తీర్మానాన్ని అమలు చేసేందుకు భారత్తో కలిసి చైనా పని చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి లిన్ జియాన్ పేర్కొన్నారు..
అంతర్జాతీయ అభివృద్ధి ఎజెండాకు సంబంధించిన అంశాలపై చర్చలకు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్న బ్రిక్స్లో సన్నిహిత సహకారానికి భారత్ విలువ ఇస్తుందని రష్యాకు వెళ్లేముందు ప్రధాని ఎక్స్ వేదిక తెలిపారు.. రెండు రోజుల బ్రిక్స్ సదస్సులో వివిధ అంశాలపై విస్తృతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నానని మోదీ పేర్కొన్నారు.. 2023 సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్ విస్తరణ కూటమి సమగ్రతను, ప్రపంచ శ్రేయస్సు కోసం ఎజెండాను చేర్చేందుకు తోడ్పడిందని ప్రధాని వెల్లడించారు.. ప్రపంచ అభివృద్ధి అజెండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సరఫరా గొలుసులను నిర్మించడం,సాంస్కృతిక అనుసంధానతను ప్రోత్సహించడం వంటి అంశాలపై బ్రిక్స్‌లో చర్చలు ఉంటాయన్నారు..”’ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం” బ్రిక్స్ ప్రధాన అజెండాగా ఈ సంవత్సరం బ్రిక్స్ సదస్సు జరగుతుందన్నారు..తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్ కూటమి ఏర్పాటు కాగా ప్రస్తుతం దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు..4 నెలల వ్యవధిలో ప్రధాని మోదీ రష్యా పర్యటన చేపట్టడం ఇది 2సారి.