ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025లో మళ్లీ ఎలాన్ మస్క్‌దే తొలిస్థానం
అమరావతి: ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు..342 బిలియన్ డాలర్ల నికర విలువతో తొలిస్థానంలో వున్నారు..గత సంవత్సరంతో పోలిస్తే మస్క్ సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగింది..ఎలాన్ మస్క్ తరువాత ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ బుకర్‌బర్గ్ నికర విలువ 216 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో,,అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 215 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో స్థానంలో నిలిచారు..ఈ జాబితాలో యూఎస్ టాప్‌లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో 902 మంది సంపన్నులు ఉన్నారు..ఆ తరువాత చైనాలో 516 మంది బిలియనీర్లు,,భారత్ 205 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది.. ఆసియాలోనే ప్రముఖ వ్యాపారవేత్త,, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధేనేత ముకేశ్ అంబానీ 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు..అలాగే గౌతమ్ అదానీ 56.3 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానంలో ఉన్నారు..