AP&TGDEVOTIONALOTHERS

తిరుమల తిరుపతి దేవస్థానాలో అందిస్తున్న సేవాలపై సమీక్షించిన సీ.ఎం చంద్రబాబు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు (టీటీడీ) సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష జరిపారు.. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు..ఈ సందర్బంలో సీఎం చంద్రబాబుకు, భక్తుల సౌకర్యాలు మెరుగు పరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది..పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు..టీటీడీ దర్శనాలు, వసతితోపాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు..శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారుల నివేదిక ఇచ్చారు..గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధులలో ఏర్పాట్లను అధికారులు వివరించారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో చర్చించారు.. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన, సౌకర్యవంతమైన సేవలకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్రం వెలుపల నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *