కాకాణి కేసు విసయంలో పోలీసుల పరిస్థితి పిల్లి,ఎలుక ఆటలా మారిందా?
3వ సారి….
అమరావతి: అక్రమైనింగ్ కేసు,,ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న,,వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు,మాజీ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డిని విచారణకు రావల్సిందిగా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.. అక్రమైనింగ్ కేసులో A4 గా వున్న కాకాణి.గోవర్దన్ రెడ్డికి, రేపు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ లో 3వ సారి పోలీసులు కాకాణి.ఇంట్లోని వారి బంధవులకు నోటీసులు అందచేశారని తెలుస్తొంది.?
తాను విచారణకు అందుబాటులోకి వస్తానని..గురువారం నుంచి అందుబాటులో వుంటాను అని చెబుతూ రెండు సార్లు విచారణకు రాలేదు..గురువారం కాకాణి కేసుపై హైకోర్టు విచారణ చేపట్టనున్న నేపధ్యంలో అప్పటి వరకు కాకాణి పోలీసులకు అందుబాటులో వచ్చే పరిస్థితి కన్పించడం లేదు..ఎలాగైన కాకాణికి స్వయంగా నోటీసులు అందచేసేందుకు పట్టు వదలని విక్రమార్కుల పోలీసులు ప్రయత్నిస్తున్నారు..ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికెళ్లి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల పరిస్థితి పిల్లి,,ఎలుక ఆటలా మారింది..కాకాణి ఓ చోట ఉండగా,, ఫోన్ సిగ్నల్స్ మరోచోట చూపిస్తున్నాయి.. మొబైల్ సిగ్నల్ ఆధారంగా వెళ్తున్న పోలీసులకు అక్కడ కాకాణి కన్సించడం లేదు.. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించి వెళ్లి చూడాగా,, అక్కడకు కూడా కాకాణి అందుబాటులోకి రాలేదు.. దీంతో ఆయన బంధువులకు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు.. హైదరాబాద్‌లో కాకాణికి మూడు నివాసాలు ఉన్నాయి.. నెల్లూరు జిల్లా కావలి సీఐతో పాటు మనుబోలు ఎస్‌ఐ, సిబ్బంది వెళ్లినట్లు తెలుస్తోంది.