ముంబైలో రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్- హోం మంత్రి అమిత్ షా
అమరావతి: ముంబైలో రూ. 1,745 కోట్ల విలువైన 349 కిలోల అంతర్జాతీయంగా అత్యంత నాణ్యమైన కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నదని, మాదకద్రవ్యాల నెట్వర్క్ లను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌పై ఇది ఒక పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. మేము మాదకద్రవ్యాల ముఠాను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి నిశ్చయించుకున్నామని X సోషల్ మీడియా వేదికగా హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో రూ.1745 కోట్ల విలువైన 349 కిలోల హై-గ్రేడ్ కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, నార్కోటిక్స్ బ్యూరో ఒక ప్రధాన అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాపై ఉక్కు చర్య చేపట్టిందన్నారు. ఇది అట్టడుగు నుంచి పైస్థాయికి వెళ్లే విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని వెల్లడించారు. ఈ ఏజెన్సీ ఒక చిన్న డ్రగ్స్ రవాణను గుర్తించి, ఒక భారీ నెట్వర్క్ ను పట్టుకుందని, ఈ అద్భుతమైన విజయానికి ఎన్‌సిబి బృందానికి అభినందనలు తెలిపారు.

