ప్రతిష్ఠాత్మకమైన ఐఫా అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్: భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా శనివారం అట్టహాసంగా జరుగుతుంది.. దక్షిణాది, ఉత్తరాది తారలు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు..ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ఏఆర్ రెహమన్, వెంకటేశ్, బాలకృష్ణ, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు..మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు.. సమంత వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.. ఐఫా 2024కు గాను ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును బాలీవుడ్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ అవార్డును అందుకున్నారు..ఉత్తమ చిత్రం విభాగంలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు అవార్డు దక్కగా,, ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో దసరా సినిమాకు నాని అవార్డు అందుకున్నాడు.