హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా దాడుల్లో మరణించాడు-ఐడిఎఫ్
అమరావతి: లెబనాన్ లోని హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది.. దక్షిణ లెబనాన్ లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ ప్రయోగించింది.. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ప్రకటించింది..నస్రల్లా మరణ వార్తలపై హెజ్‌బొల్లా ఇంకా స్పందించలేదు.. శుక్రవారం రాత్రి నుంచి కాంటాక్ట్ లో లేడని హెజ్‌బొల్లా వర్గాలు వెల్లడించాయి..దాడుల సమయంలో నస్రల్లా అదే కార్యాలయంలో ఉన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది..నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి..ఆమె మృతిపై కూడా హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులు ఇంకా ధృవీకరించలేదు.. ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ,, నస్రల్లా హెజ్‌బొల్లా చీఫ్ గా 32 సంవత్సరాల పదవీకాలంలో అనేక మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను హతమార్చాడని, వేలాది ఉగ్రవాద చర్యలకు ప్రణాళికలు, అమలుకు బాధ్యత వహించాడని తెలిపారు..ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమాయక పౌరులను బలిగొన్న ఉగ్రవాద దాడులకు హసన్ నస్రల్లా కారణమని తెలిపాడు.