తిరుపతికి చేరుకున్న సిట్ బృందం
తిరుపతి: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై విచారణ కోసం ప్రభుత్వం 9 మందితో సిట్‌ను ఏర్పాటు చేసింది..శనివారం సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇతర సభ్యులు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు.. కమిటీకి నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సీఐలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణలు శ్రీవారిని దర్శించుకుని,,స్వామివారి సేవలో పాల్గొన్నారు..స్వామివారి దర్శన అనంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు..తిరుమల నుంచి తిరుపతికి చేరుకుని, పోలీసు అతిథిగృహంలో సమావేశమై కార్యాచరణపై చర్చించారు..మూడు రోజుల పాటు సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది..కల్తీ నెయ్యి వినియోగం వెనక ఎవరున్నారనే దానిపై సిట్ లోతైన విచారణ జరపనుంది.