హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య
అమరావతి: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యారు.. దింతో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోసాద్, ఈ హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇస్మాయిల్ హనియేను హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు గతంలో ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది..
ఖతార్‌లో నివసిస్తున్న ఇస్మాయిల్ హనియే ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్‌కు వెళ్లాడు..అక్కడే ఈ హత్య జరిగింది.. అయితే హనియేను ఎవరు హత్య చేశారు..? ఎలా హత్య చేశారు..? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇరాన్ నుంచి వెలువడలేదు..ఇస్మాయిల్ హనియా హత్యను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది..
ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇంతవరకు హనియే హత్యపై స్పందించలేదు.. పాలస్తీనాలోని హమాస్ గ్రూప్‌కు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతొంది..ఈ నేపథ్యంలో ఇప్పుడు హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హత్యకు గురికావడం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి..హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది..గతేడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌లో పౌరుల ఊచకోతకు పథకం వేసినట్లు హనియాపైనే ఆరోపణలు వచ్చాయి.. ఇస్మాయిల్ హనియాను అమెరికా విదేశాంగ శాఖ 2018లో ఉగ్రవాదిగా ప్రకటించింది.. ఇస్మాయిల్ హనియా 2017లో హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతిగా ఎన్నిక అయిన తరువాత అతను గాజాలో కాకుండా ఖతార్‌లో నివసిస్తున్నాడు.