ఇంజనీరింగ్ రంగంలో చరిత్ర సృష్టించిన డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య
నేడు “ఇంజినీర్స్ డే”..
అమరావతి: భారతీయులు శాస్త్ర,సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటారు అనేందుకు ఉదాహారణ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య,,ఇంజనీరింగ్ రంగంలో చరిత్ర సృష్టించిన విశిష్టమైన వ్యక్తి..భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్నారు..(1968 సెంప్టబరు 15వ) ఆయన పేరు మీద ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు..డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న మైసూరులోని కోలార్ జిల్లాలో ఒక ఆయుర్వేద వైద్యుని కుటుంబంలో జన్మించారు..విశ్వేశ్వరయ్య తండ్రి శ్రీనివాస్ శాస్త్రి వైద్యుడే కాదు సంస్కృతంలో పండితుడు కూడా..దేశానికి విశ్వేశ్వరయ్య చేసిన గొప్ప కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారత ప్రభుత్వం 1968లో ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది.. . అయన ఏప్రిల్ 14వ తేది,1962న 101 సంవత్సరాల వయస్సులో మరణించాడు.. భౌతికంగా మన మధ్యలో లేకున్నా సర్ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు నేటీకి సజీవంగానే మిగిలే ఉన్నాయి.