ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు హతం
అమరావతి: ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని దంతెవాడ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా బలగాలను స్వాధీనం చేసుకున్నారు.. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దు,, అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి.. బస్తర్ పరిధిలో 4 జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ లో వుండగా,వారికి మావోయిస్టులు తారసపడ్డారు..దీంతో తెల్లవారుజాము 3 గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి..కూంబింగ్‌లో DRG,STF,CRPF బలగాలు పాల్గొన్నాయి..ఇప్పటి వరకు తెలిసిన సమాచారం.. ఉగ్రవాద రహిత భారతదేశంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్రహోంమంత్రి అమిత్‌షా చాలా పట్టుదలతో ఉన్నారు..ఇందులో భాగంగానే ఆపరేషన్ ఖగార్ మొదలైంది.. 2026, మార్చి 31 నాటికి దేశంలో ప్రశాంత వాతావరణ నెలకొల్పేందుకు భధ్రత దళాలు కృష్టి చేస్తున్నాయి.