NATIONAL

8,500 అడుగుల ఎత్తులో నిర్మించిన Z-Morh Tunnelను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం జమ్ముకశ్మీర్‌ లోని సోన్‌మార్గ్‌ ప్రాంతంలో Z-Morh Tunnelను ప్రారంభించారు.. టన్నెల్ ప్రారంభోత్సవంలో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు.. ప్రధాని రాక సందర్బంగా జమ్ముకశ్మీర్‌లో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు..శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌ వెళ్లే దారిలో శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై ఈ టన్నెల్‌ను నిర్మించారు.. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యాయి.. ఈ టన్నెల్‌ నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు..భారత రక్షణ రంగానికి వ్యూహాత్మకంగా ఈ టన్నెల్‌ చాలా కీలకం అయినది.. Z-Morh Tunnel 6.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం జరిగింది..ఈ టన్నెల్‌ ద్వారా ఏలాంటి వాతావరణంలో అయిన లడఖ్‌కు చేరుకోవడానికి వీలవుతుంది.. టన్నెల్‌కు సంబంధించి 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి.

Z-Morh Tunnel భారత్‌కు వ్యూహాత్మకంగా దాదాపు సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు..అత్యంత శీతలమైన పరిస్థితులు వున్న సమయంలో ఈ సొరంగం,, రవాణా వ్యవస్థతోపాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకం కానుంది.. గతంలో కార్గిల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడగా భారత్ ఏకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది..శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతాబలగాలపై దాడులకు తెగబడ్డారు.. ప్రస్తుతం Z-Morh Tunnel ద్వారా మనం సైన్యం కార్గిల్‌కు వేగంగా చేరుకునే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *