NATIONAL

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ను మంగళవారం విడుదల చేసింది..ఈ సంవత్సరం ఫిబ్రవరి 23తో ప్రస్తుత డిల్లీ అసెంబ్లీ గడవు ముగుస్తున్న నేపధ్యంలో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.. డీల్లీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదిన పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది..ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది..జనవరి 10వ తేదిన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.. జనవరి 17వ తేది వరకు నామినేషన్‌లు,,జనవరి 20వ తేది వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.. షెడ్యూల్‌ విడుదల సందర్భంగా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ,EVMల ట్యాంపరింగ్‌ ఆరోపణలు CEC రాజీవ్‌కుమార్‌ ఖండించారు.. EVMలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని,, EVMల రిగ్గింగ్‌ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని అన్నారు.. కోర్టులు కూడా ఈ విషయంను దృవీకరించాయన్నారు..EVMల రిగ్గింగ్‌ సాధ్యం కాదని స్పష్టం చేశారు..చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్‌ మీట్‌ అని చెప్పారు.. ఓటింగ్‌ శాతంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై కూడా అయన స్పందించారు.. పోలింగ్‌ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్‌ శాతం వెల్లడించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *