నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం,53 మంది మృతి
అమరావతి: నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.. టిబెట్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది..నేపాల్‌తోపాటు చైనా,, భారత్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి..ఈ భూకంపం ధాటికి కనీసం 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.. గాయపడిన ప్రజల సంఖ్య ఇంకా స్పష్టం కాలేదని పేర్కొంది..టిబెల్ రాజధాని లాసాకు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది.. టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.. భూకంపం తీవ్రత ఢిల్లీ ఎన్సీఆర్,,బీహార్,,అస్సాం,, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి..భారీ భూకంపం ధాటికి పలుచోట్ల ఎత్తైన భవనాలు నేలకూలాయి..రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీస్తున్నారు.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది.