ఎలాంటి ఆందోళన అవసరం లేదు, HMPV కొత్త వైరస్ కాదు-కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా
అమరావతి: HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.. మాట్లాడుతూ HMPV కొత్త వైరస్ కాదని,, 2001లో తొలిసారి గుర్తించగా, చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నట్టు నిపుణులు వివరణ ఇచ్చారని జేపీ.నడ్డా చెప్పారు..భారత్‌లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయంటూ వార్తల నేపథ్యంలో కేంద్రం మంత్రి పై విధంగా స్పందించారు..ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు..దేశంలో ఎలాంటి ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నమన్ని నడ్డా,, పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని నడ్డా తెలిపారు.. గాలి ద్వారా, రెస్పిరేషన్ ద్వారా HMPV వ్యాప్తి జరుగుతుందని,,అన్ని వయస్సుల వారిపైనా దీని ప్రభావం ఉండ వచ్చని, చలికాలంలో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుందన్నారు.. చైనాలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూసినట్టు వార్తలు రావడంతో చైనాతో పాటు, పొరుగుదేశాల్లో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ,,ICMR,, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ క్షణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయని పేర్కొన్నారు.