చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనంకు 250 కేజీల ‘ప్రయాగ్యాన్’రోవర్-ఇస్రో ఛైర్మన్
అమరావతి: చంద్రయాన్-5 మిషన్‌కు సంబంధించి కేంద్రం అనుమతి మంజూరు చేసిందని ఇస్రో చైర్మెన్ నారాయణన్ మీడియాకు తెలిపారు..సోమవారం బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3 ద్వారా 25 కేజీల బరువున్న ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకెళ్లారని,,త్వరతలో ప్రయోగించనున్న చంద్రయాన్-5 ద్వారా 250 కేజీల బరువున్న రోవర్ చంద్రుడి మీదకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు 2008లో చంద్రయాన్-1 మిషన్‌ను విజయవంతంగా చేపట్టారు.. సదరు ప్రయోగం ద్వారా చంద్రుడిపై ఉన్న రసాయనిక,,ఖనిజ,, ఫోటో జియోలాజిక్ మ్యాపింగ్ చేశారు..అటు తరువాత చంద్రయాన్-2 మిషన్‌ను 2019లో చేపట్టారు..సదరు ప్రాజెక్టు 98 శాతం సక్సెస్ అయ్యింది.అయితే చంద్రయాన్-2 ద్వారా పంపిన హై రిజల్యూషన్ కెమెరా ఇప్పటికీ వందల సంఖ్యలో ఇమేజ్‌లను పంపుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.