జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
అమరావతి: ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్కు శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు.. ఈ కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలే, సీపీఐ నేత డీ రాజా హాజరయ్యారు.