జిల్లాలో ప్రతి ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల పరీక్షల నిర్వహించాలి-కలెక్టర్
తిరుపతి: జిల్లాలో క్యాన్సర్ అనే మహమ్మారి నిర్ములించేందుకు ఈ నెల 14 నుంచి జిల్లాలో ప్రతి ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల పరీక్షల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని DM&HOను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో క్యాన్సర్ పరీక్షల నిర్వహణపై డాక్టర్లు, ANMలు,ఆశవర్కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి టీమ్ రోజుకు 5 కుటుంబాలకు పరీక్షలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బిపి, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్, పక్షవాతం, బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి నిర్దారణ పరీక్షలు CHO, ANM, ఆశ కార్యకర్తలు క్వాలిటీగా స్క్రీనింగ్ పరీక్షలునిర్వహించాలన్నారు. ANMలు పరీక్షలకు సంబంధించి వ్యాధులను యాప్ లో అప్ లోడు చేయాలని,మెడికల్ ఆఫీసర్లు నిర్ధారణ పరీక్షల్లో వ్యాది నిర్దారణ అయితే చికిత్స చేయాలన్నారు.ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సూపర్వైజర్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్లు,మండల స్థాయి డాక్టర్లు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. చికిత్స అనంతరం వ్యాధి గ్రస్థుల సంక్రమంగా మందులు వాడుతున్నారా లేదని పరిశీలించాలన్నారు. ముందురోజు ఆశ వర్కర్లు వారి కేటాయించిన గ్రామాలకు వెళ్లి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి మీ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నసమాచారాన్ని ముందుగానే తెలియజేయాలన్నారు.ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ Dr.రవికుమార్, ప్రిన్సిపాల్ Dr.చంద్రశేఖర్, Dr.సునీత, DM&HO Dr.శ్రీహరి, MLHPలు, ANMలు,ఆశ వర్కులు తదితరులు పాల్గొన్నారు.