రెండు రోజుల్లో రాయలసీమ,దక్షిణకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం-APSDMA
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు,,శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాయలసీమ,దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.