భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే-మంత్రి అనం
నెల్లూరు: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి,భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు..శుక్రవారం పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు..పూలే ఆశయ సాధనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.. నెల్లూరు నగరంలోని పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్బంలో మంత్రి ఆనం చెప్పారు..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.