మైలవరం టెక్స్ టైల్ పార్క్ లో ప్లాట్స్ కేటాయింపు-జిల్లా కలెక్టర్ శివశంకర్
కడప: జిల్లాలోని మైలవరం టెక్స్ టైల్ పార్క్ కు రాబోవు రోజుల్లో మహర్దశ పట్టనుందని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. మైలవరం లోని టెక్స్ టైల్ పార్క్ ను వివిధ శాఖల అధికారులతో కలిసి,జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సందర్శించి చేనేత కార్మికుల కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి మాట్లాడుతూ, 2005-2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మైలవరంలో 62.18 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కుకు కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో డైయింగ్ యూనిట్స్ 21, గార్మెంట్ యూనిట్స్ 32, పవర్ యూనిట్స్ 37, హ్యాండ్లూమ్ యూనిట్స్12 హ్యాండ్లూమ్స్,,పవర్ లూమ్ యూనిట్స్ 6 తో కలిపి మొత్తం 118 యూనిట్స్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నామన్నారు. చేనేత కార్మికులు ఇందులో యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఇనిషియల్ పేమెంట్ కింద 17 ఏళ్ల కిందట 50 వేల రూపాయలు కట్టాలని నిర్ధారించారన్నారు. ఇందులో కొంతమంది ఫుల్ పేమెంట్ చేయగా, మరి కొంతమంది పార్షియల్ పేమెంట్ చేశారని వారందరూ సెప్టెంబర్ 17వ మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు మిగతా పేమెంట్ చెల్లిస్తే అందరికీ కలిపి కలెక్టరేట్లో సెప్టెంబర్ 20 తేదీన లాటరీ తీయడం జరుగుతుందన్నారు. ఆ లాటరీలో వచ్చిన వారికి అదే రోజు యూనిట్స్ ప్రారంభించడానికి ప్లాట్ కేటాయించడం జరుగుతుందన్నారు. ప్లాట్ అలాట్మెంట్ అయిన వారు ఆరు నెలల్లో బేస్మెంటు ఏర్పాటు చేసుకోవాలని, తొమ్మిది నెలల్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. ఈ టెక్స్టైల్ పార్కులో అవసరమైన సివిల్ వర్క్స్, రోడ్లో, వాటర్ కనెక్టివిటీ,విద్యుత్తు కావలసిన మౌలిక వసుతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.మైలవరం టెక్స్టైల్ పార్కు గండికోట టూరిజం దగ్గరగా ఉండటం వల్ల ఎడ్యుకేషన్ టూరిజం గా అభివృద్ధికి చేస్తామన్నారు. అలాగే ఈ టెక్స్టైల్ పార్కు యూనిట్స్ ఏర్పాటుకు చేనేత కార్మికులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పీఎం ఈజిపి సబ్సిడీతో 50 లక్షలు వరకు లోన్ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ మైలవరం టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి చేనేత కార్మికుల కమిటీ సభ్యులు అందరూ సహకరించాలని కోరారు.