తెలంగాణ సీ.ఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి చెక్కును అందచేసిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు..తొలుత పవన్ కల్యాణ్ ను రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి శాలుతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణలో హైడ్రా గురించి రేవంత్ రెడ్డిని అడిగి పవన్ వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. హైడ్రా ఏర్పాటు, దాని పనితీరును పవన్ కు రేవంత్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని పవన్ చెప్పినట్లు సమాచారం..రేవంత్ రెడ్డిని కలిసినవారిలో పవన్ కళ్యాణ్ తోపాటు తెలంగాణ జనసేన నాయకులు కూడా ఉన్నారు.