అల్పపీడనం బలపడి, సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం-APSDMA
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం,,దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని APSDMA M.D కూర్మనాథ్ తెలిపారు..ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి సోమవారం (నవంబర్ 25న) దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.. ఆటు తర్వాత మరో 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు.. దీని ప్రభావంతో బుధవారం నుంచి శనివారం(27-30నవంబర్) వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.