ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ సిండికేట్ల మాఫియా కేసులో కోట్ల రూపాయల అవినితికి పాల్పపడిన కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు ED,,CBI దాఖలు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది..బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సూచించింది..సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది..దాదాపు 165 రోజుల తరువాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు..బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ,, లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని,, ఛార్జీ షీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం తెలిపింది..బెయిల్ కండీషన్స్:- పాస్‌పోర్టును మెజిస్ట్రేట్‌కు సరెండర్ చేయాలి.. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి..కేసు ట్రయల్‌కు ,,విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని అదేశించింది.