‘థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ’ అనేది మా విధానం-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది.. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీల పై చర్చించి, ఆమోదించామని,,’థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ’ అనేది మా విధానం అని,,రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీ.ఎం చంద్రబాబు మీడియాకు తెలిపారు.. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు : 1. AP Industrial Development Policy 2. AP MSME & Entrepreneur Development Policy 3. AP Food Processing Policy 4. AP Electronics Policy 5. AP Private Parks Policy 6. AP Integrated Clean Energy Policy.
సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.. ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామని తెలిపారు.. దీనిలో భాగంగా రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీలను తెస్తున్నామన్నారు.. జాబ్ ఫస్ట్ పేరుతోనే అన్ని పాలసీలను రూపొందిస్తున్నామని,,ప్రతి పాలసీలో ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.. గతంలో చేసిన పాలసీల్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయని అడిగేవారని,, తాము కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నామనే విషయాన్ని చూస్తున్నామన్నారు.. ఉద్యోగాలకు, ఉపాధి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందిస్తుందన్నారు..రాష్ట్రంలో ధింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు..
రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.. నీతి, నిజాయితీగా వ్యాపారం ఎలా చేయాలనేదానికి రతన్ టాటా నిదర్శనమన్నారు.. ఉత్తరాంధ్రలో విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాలకు రాజమండ్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ లేదా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకు తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలుకు సంబంధించి అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటుచేస్తామన్నారు.. ప్రధాన కేంద్రం అమరావతిలో ఉంటుందని,, మిగతా ఐదు జోన్లలో ఐదు కేంద్రాలను రతన్ టాటా పేరుతో ఏర్పాటుచేస్తామని చంద్రబాబు తెలిపారు.