ఇండియా గాట్ లాటెంట్ టీవీ షోలో నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు
అమరావతి: ఇండియా గాట్ లాటెంట్ టీవీ షోలో నీచమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాహ్‌బాదియాతో పాటు ఇతర యూట్యూబర్లు ఆశిశ్ చంచ్లానీ, అపూర్వ ముఖీజా తదితరులపై మహారాష్ట్రలో మంగళవారం కేసు నమోదైంది.. సైబర్ బ్రాంచ్ పోలీసులు ఆ షో ఫుటేజీని పరిశీలించిన అనంతరం వారిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (అసభ్యకర కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం) కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు..మొత్తం 30 మంది కేసు నమోదు చేశారు..ఇందులో నటి రాఖీ సావంత్ కూడా ఉన్నారు.. కేసు నమోదైన వాళ్లల్లో కొందరిని విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసినట్టు తెలిపారు.. మరికొందరికి త్వరలో సమన్లు పంపిస్తామన్నారు..షోలో రణ్‌వీర్ వ్యాఖ్యలు వైరల్ కాగా చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు..‘‘ప్రతి ఒక్కరికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది..అయితే అవతిలి వారి స్వేచ్ఛను భంగం వాటిల్లే సమయంలో మన స్వేచ్ఛకు ముగింపు పడుతుంది’’ అని కఠినంగా హెచ్చరించారు.. అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి రణ్‌వీర్‌పై నమోదైన రెండో కేసు ఇది..గతంలో అస్సామ్ పోలీసులు కూడా రణ్‌వీర్‌తో పాటు సమయ్ రాణాపై కేసు నమోదు చేశారు.