NATIONALOTHERSWORLD

ఏఐ విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం అందరితో పంచుకోవడానికి సిద్ధం-ప్రధాని మోదీ

అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,,ఈ శతాబ్దంలో మానవాళికి కోడ్‌ను రాస్తోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు..మంగళవారం పారిస్‌లోని గ్రాండ్ పలైస్‌లో జరిగిన AI యాక్షన్ సదస్సు’కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి సహ-సారథ్యం వహిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు..మన ఉమ్మడి విలువలను సమర్థించే,,నష్టాలను పరిష్కరించే,, నమ్మకాన్ని పెంపొందించే పాలన,,ప్రమాణాలను స్థాపించడానికి ప్రపంచవ్యాప్త సమిష్టి ప్రయత్నం అవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.. AI నిర్వహణతో ముడిపడిన నైతిక నియమావళి,,ఆ సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కోవడంపై విలువైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. అంతర్జాతీయ స్థాయిలో విధివిధానాలు,, ప్రమాణాల రూపకల్పన దిశగా ప్రపంచ దేశాలు ఉమ్మడి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.. ‘AI’ సాంకేతికతను ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లో ఉన్న దేశాలకు అందేలా చూడాలన్నారు..ఆర్థికంగా,, సాంకేతికంగా,,నైపుణ్యాలపరంగా,, ఇంధనవనరుల పరంగా వెనుకంజలో ఉన్న ఆయా దేశాలకు దన్నుగా నిలవాలని భారత ప్రధాని కోరారు.. భారతదేశం సొంతంగా లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని,,ఈ బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ,, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంలో ఈ కసరత్తు జరుగుతోందన్నారు.. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్‌ను మా దేశంలోని స్టార్టప్‌లు,, పరిశోధకులకు చౌక ధరకు అందిస్తాంమన్నారు.. మా దగ్గర ఉన్న విజ్ఞానాన్ని ప్రపంచ శ్రేయస్సు కోసం అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని మోదీ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *