సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పుణ్య క్షేత్రాలు యాత్రకి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యణ్
అమరావతి: కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు..పవన్ కల్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 11 పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి బుధవారం శ్రీకారం చుట్టారు..ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు.. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలను పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు..