ప్రజలను లబ్ధిదారుల పేరిట పరాన్నజీవులుగా మారుస్తున్నారు-సుప్రీమ్ కోర్టు
అమరావతి: ప్రజలను లబ్ధిదారుల పేరిట పరాన్నజీవులుగా రాజకీయ పార్టీలు మారుస్తున్నయని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది..బుధవారం ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటీషన్‌కు సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు, ఎన్నికలకు ముందు ఉచితాలను అందించే పద్ధతిని జస్టిస్ బిఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించింది..ఉచిత పథకాలతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటంలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఏ పనీచేయకుండా డబ్బు,,ఆహారం వారు అందుకుంటున్నారని వ్యాఖ్యనించింది..
“ఉచిత పథకాలు మంచివి కావు, దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా ప్రజలు ఏ పని చేయడానికి ఇష్టపడటం లేదన్నది..ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే…అయితే వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలే తప్ప ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదు’’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది..“ నిరాశ్రయులైన వారి పట్ల మీకున్న శ్రద్ధను మేము చాలా అభినందిస్తున్నాము,, కానీ వారిని సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసి, దేశాభివృద్ధికి దోహదపడటానికి అనుమతించడం మంచిది కాదా” అని ధర్మాసనం ప్రశ్నించింది..కేంద్రప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉందని,, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ఈసందర్భంగా ధర్మాసనానికి తెలిపారు..దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ, ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పని చేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది..ఈ పిటిషన్‌ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని వాయిదా వేసింది.