వైసీపీ నేత,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేరళలో అరెస్ట్ చేసిన పోలీసులు
అమరావతి: వైసీపీ నేత,,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు..అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు..రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం ఉంది..అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించింది..వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.. గని లీజు కాలం ముగిశాక కూడా, వైసీపీ నేతలు గనులను ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని,, మైన్స్ లో రాళ్ళను పేల్చేందుకు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి..ఈ విషయంపై ఫిబ్రవరి 16న కాకాణితో సహా పలువురిపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.. కాకాణిని A4 గా చేరుస్తూ విచారణకు రావాలంటూ 3సార్లు అధికారులు నోటీసులిచ్చారు..నెల్లూరు,,హైదరాబాద్‌లోని కాకాణి ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులందజేశారు..అలా మూడుసార్లు నోటీసులిచ్చినా విచారణకు రాకుండా కాకాణి తప్పించుకుని తిరిగాడు.. దాదాపు 2 నెలలుగా అజ్ఞాతంలోకి ఉన్నారు..