కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించి ఉంటే మీరే తొలగించండి-మంత్రి నారాయణ
లేదంటే మేమే తొలగిస్తాం..
నెల్లూరు: నగరంలోని ప్రధాన కాలువల స్థితిగతులపై సమగ్రంగా సర్వేచేపట్టాలని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు..శనివారం నగరంలోని 16వ డివిజన్ ప్రాంతాల్లో అధికారులతో కలసి పలు కాలువల పరిస్థితిని పరిశీలించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.. కాలువలను ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మించి ఉంటే తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. భవిష్యత్ ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామన్నారు. నెల్లూరు మధ్యలో నుంచి వెళుతున్న సర్వేపల్లి కెనాల్, అదికాకుండా రామిరెడ్డి కెనాల్, ఊయ్యాలకాలువ, మల్లప్పకాలువలు గతంలో ఎప్పుడు నుంచే ఉన్నాయన్నారు..2015లో వచ్చిన వరద వల్ల అప్పట్లో సిటీ మునిగిపోయిందని తెలిపారు.