వారం రోజులు టైం ఇస్తున్నా,ఒక్క పోస్టర్, ఫ్లెక్సీలు కూడా ఉండకూడదు-మంత్రి నారాయణ
నెల్లూరు: వారం రోజులు టైం ఇస్తున్నా,ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదని,,కనిపిస్తే ఊరుకోనని మంత్రి నారాయణ చెప్పారు.శనివారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైవోవర్ బ్రిడ్జి కింద ఉన్న గోడలకు అంటించిన పోస్టర్లను మంత్రి నారాయణ స్వయంగా క్లీన్ చేశారు. అదే విధంగా అగ్నిమాపక శాఖ సహాయంతో, వాటర్ మిషన్ తో వాటిని క్లీన్ చేశారు. ప్రజలందరూ నెల్లూరు నగరాన్ని అందంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు. సిటీని పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చాలన్నదే నా లక్ష్యమన్నారు.నగరంలోని గోడలపై ఉన్న పోస్టర్లను క్లీన్ చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ఒక వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నారన్నారు. అయినా ఇబ్బందికరంగా ఉండడంతో నేను డీజీ, నెల్లూరు శాఖాధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఫైర్ సహాయం తీసుకొని క్లీన్ చేయడం జరుగుతుందన్నారు. వన్ వీక్‌లో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదని అధికారుల్ని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రకటనలన్నీ సోషల్ మీడియాలో ఇచ్చుకోవాలని…గోడలపై అంటించ కూడదని…తనదైన శైలిలో హెచ్చరించారు. డెవలప్ కంట్రీస్‌లో వాల్ పోస్టర్లు ఎక్కడా కనిపించవని… అంతా సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తుంటారన్నారు. సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదన్నారు. ముఖ్యంగా నా ఫ్లెక్సీలు ఎక్కడున్నా ఫస్ట్ పీకేయాలని కమిషనర్‌కు తెలిపానని చెప్పారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నా ఫ్లెక్సీలను తీయించానని తెలిపారు. రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుంటే 48 గంటల్లోనే తీసేయాలన్నారు. ఫ్లెక్సీలు ఎవరూ కట్టవద్దని నెల్లూరు నగర ప్రజలందరికి ఆయన విజ్ఞప్తి చేశారు.