మావోయిస్టులు ఎక్కడ నక్కి ఉన్నా,పసిగట్టే “ఈగల్ స్కాడ్ కన్ను”
అమరావతి: అధునికి నిఘా వ్యవస్థలు,పరికరాల కంటే పురాతనకాలంలో భారతదేశంలో రాజులు ఉపయోగించిన సంప్రదాయ పద్దతుల్లోనే శత్రువుల కదలికలను పసిగట్టి అంతమొందించవచ్చు అనే విషయం, నేడు మావోయిస్టుల ఏరివేతలో భద్రత బలగాలు నిరూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి….దండకారణ్యంలో పాతకుపోయిన మావోయిస్టులను 2026లోపు తుడిచి పెట్టేస్తామని హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్ మెంట్ కార్యరూపంలో దూసుకుని పోతుంది..గత కొన్ని నెలల్లోనే దాదాపు 188 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.. ఇందుకు సంప్రదాయ పద్దతుల్లో భద్రత దళాలు ఉపయోగిస్తున్న‘ఈగల్ స్కాడ్’ ముఖ్యమైనదని, మావోయిస్టుల ఏరివేతలో అపరేన్స్ లో పాల్గొన్న మాజీ పోలీసు ఉన్నతధికారులు పేర్కొంటూన్నారు..రాజుల కాలంలో రహస్య లేఖలు,, అత్యవసర వర్తమానలను పంపేందుకు పావురాలను,,డేగలను ఉఫయోగించేవారు.. ఇటీవల వరకు డ్రోన్లపై ఆధారపడిన భద్రత దళాలు నేడు ‘ఈగల్ స్కాడ్’ ను ఉఫయోగించడం ద్వారా తాము అనుకున్నవిధంగా ఫలితాలను సాధిస్తున్నారు..
‘ఆపరేషన్ కగార్’:- మావోయిస్టుల ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ ‘ఆపరేషన్ కగార్’‘ను పూర్తి చేసేందుకు ఈగల్ స్కాడ్’ సహకారం తీసుకున్నట్లు తెలియ వచ్చింది.. నల్లమల అడవుల్లోంచి రెండేళ్ల వయసున్న డేగ పిల్లలను తెచ్చి వాటికి మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA)లోప్రత్యేక శిక్షణ ఇచ్చారు..సంఘ విద్రోహ శక్తుల చర్యలను పసిగట్టేందుకు, రక్షణ, రహస్య ప్రదేశాల్లో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు 2020లో ‘ఈగల్ స్కాడ్’ రూపుదాల్చింది..కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి దేశంలో మావోయిస్టు వ్యవస్థ తుడిపెట్టే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’కు తెలంగాణలో శిక్షణ పొందిన, పొందుతున్న గద్దలను వినియోగించినట్టు విశ్వసనీయ సమాచారం..
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం.. ప్రత్యేక శిక్షణ పొందిన గద్దలతో డ్రోన్ దాడులకు చెక్ పెట్టవచ్చని నాటి డీజీపీ రవి గుప్తా వ్యాఖ్యనించారు.. వీటి కాళ్లకు GPS ట్రాకర్, మెడకు, రెక్కల కింద మైక్రో కెమెరాలు అమర్చినట్టు తెలస్తొంది.. వీటి ద్వారానే మావోయిస్టుల సమాచారం తెలుసుకొని,ఒక పథకం ప్రకారం ‘ఈగల్ స్కాడ్’ మావోయిస్టులను ఏరివేస్తున్నారు..
ఈగల్ స్వాడ్:- వానకాలం, చలికాలాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉన్నా వీటి వద్ద నుంచి సమాచారం అందుతుంది..తొలుత నిఘాలో పావురాలకు శిక్షణ ఇద్దామని భావించినా అవి ప్రతికూల వాతావరణంలో ఎగరలేకపోవడంతో డేగలవైపు మళ్లారు..డేగలు తుఫాను సమయంలోనూ మేఘాల కంటే ఎత్తులో వెళ్లి అవిశ్రాంతంగా పనిచేస్తాయి..సంఘ విద్రోహక శక్తులు ఉపయోగించే డ్రోన్లను సులభంగా గుర్తించేలా తర్ఫీదునిచ్చారు. అవి రెండు కిలోల దాకా బరువును కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు సులభంగా మోసుకురాగలవు..ప్రధాని, ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంగా డ్రోన్లపై నిషేధం ఉంటుంది.. అలాంటి సందర్భాల్లో డేగలు నిఘా పెట్టి మరీ ఏవైనా డ్రోన్లు గాల్లోకి ఎగిరితే వాటిని పట్టుకొచ్చి, అధికారులకు అప్పగిస్తాయి.. డేగలకు అమర్చే కెమెరాల ద్వారా నిషేధిత, అనుమానిత ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను రికార్డ్ చేస్తుంటారు.. ప్రపంచంలో ఇలాంటి డేగలు ఒక నెదర్లాండ్స్ లోనే ఉన్నాయోగిస్తున్నారు..