రాబోయే 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం-APSDMA
అమరావతి: నైరుతి రుతుపవనాల తిరొగమనం ఈ నెల 17వ తేది నాటికి పూర్తి కావచ్చని వాతావరణశాఖ అంచనాలు వేసింది..నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది..అక్టోబర్ 7 నుంచి 10 మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరం చుట్టూ, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురియనున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది..నైరుతి బే, ఉత్తర బెంగాల్, తమిళనాడు తీరానికి సమీపంలో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది..అలాగే బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని తెలిపింది..