అమెరికా అధ్యక్షడు డానాల్డ్ ట్రంప్‌పై హత్యయత్నం
అమరావతి: అమెరికా అధ్యక్షడు డానాల్డ్ ట్రంప్‌పై, వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శనివారం నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో దుండగుడు కాల్పులు జరిపాడు. దాదాపు 5 నుంచి 8రౌండ్లు కాల్పులు జరిపినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో పోస్ట్ చేస్తూ దీనిని ‘ఒక అద్భుతమైన సాయంత్రం’ అని అభివర్ణించారు. సీక్రెట్ సర్వీస్, లా ఎన్ఫోర్స్ మెంట్ వేగంగా, ధైర్యంగా అద్భుతంగా పనిచేశాయని ప్రశంచారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని, అయితే తాను పూర్తిగా లా ఎన్ఫోర్స్ మెంట్ మార్గదర్శకాలను పాటిస్తానన్నారు. ఈ ఘటనలో ట్రంప్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈవెంట్లో పాల్గొన్న అతిధులు ప్రాణ భయంతో కాల్పుల శబ్దం వినబడడంతో టేబుళ్ల కింద దాక్కొన్నారు.
నిందితుడు అరెస్ట్:- ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 31 ఏళ్ల కోల్ టామస్ అలెన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఇంజినీరింగ్‌లో చదివిన అలెన్, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

