రాయచోటి ఉగ్రవాదుల ఇళ్లలో సూట్‌కేస్ బాంబులు-2 వేరు వేరు కేసులు నమోదు
అమరావతి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రసోదరుల కార్యకలాపాలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.. రాయచోటిలో అరెస్ట్ అయిన ఇద్దరు ఉగ్రవాదుల నెట్‌వర్క్ పై లోతుగా విచారణ జరుపుతున్నామని DIG కడపజిల్లా విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు..గురువారం రాయచోటిలో DIG ప్రవీణ్,,కడపజిల్లా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబూబకర్ సిద్దిక్ అలియాస్ సిద్దిక్ ఐదేళ్ల క్రితం రాయచోటిలోనే వివాహం చేసుకున్నాడని తెలిపారు..మరో ఉగ్రవాది మన్సూర్ 10 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలోనే వివాహం చేసుకున్నాడన్నారు..వీరిద్దరి భార్యల కదలికలు అనుమానాస్పదంగా వుండడంతో వీరిని కూడా అరెస్టు చేశామని తెలిపారు..ఇద్దరు ఉగ్రవాదులు బాంబులు తయారు చేయడంతో టెక్నీకల్ ఎక్స్ పర్ట్స్ అన్నారు.. వీరి నివాసాల్లో దొరికిన మందు గుండు సామగ్రి,, స్థానికంగా దొరికే వస్తువులతోనే వీరు బాంబులు తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు..
బాంబులను నిర్వీర్యం:- అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రసోదరుల కార్యకలాపాలపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. తమిళనాడులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ మన్సూరు అలీలను 3 రోజుల కిందట ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.. ఐబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అనేక పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్ కేస్ బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నారు.. ఈ క్రమంలో వారి ఇళ్లలో దొరికిన సూట్‌కేసు బాంబులను రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో ఆక్టోపస్ బృందం పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఉగ్రవాదులపై ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం:- ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై రాయచోటి పోలీసులు 2 వేరు వేరు కేసులు నమోదు చేశారు.. అబూబకర్ సిద్ధిఖీ అలియాస్ అమానుల్లా ఆయన భార్య షేక్ సైరాబానుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరో కేసులో ఉగ్రవాది షేక్ మన్సూర్ అలీ ఆయన భార్య షమీం పైన ఇవే సెక్షన్లు వర్తింపజేస్తూ కేసులు నమోదు చేశారు.. గురువారం ఉగ్రవాదుల భార్యలు షేక్ సైరా భాను, షేక్ షమీమ్ అరెస్ట్ చేసి రాయచోటి కోర్టులో హాజరపరచగా విచారించిన న్యాయస్థానం ఇరువురికి 14 రోజుల రిమాండ్ విధించింది.. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
బాంబులు పేల్చడానికి కుట్ర:– ఈ ఇద్దరు సోదరులు ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు.. రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు.. 1995లో చెన్నైలోని చింతాద్రిపేట హిందూమున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు..అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులు.. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి.. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు..1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో వీరిపై అభియోగాలున్నాయి.